Saturday, January 18, 2025
HomeTrending Newsఉత్తరప్రదేశ్ లో భూకంపం

ఉత్తరప్రదేశ్ లో భూకంపం

ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. లక్నోకు ఉత్తర-ఈశాన్యంగా 139 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 1.12 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. భూకంపం యొక్క లోతు భూమిలో 82 కి.మీ.గా ఉంది. మరోవైపు రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో భూకంపం లడఖ్‌ను వణికించింది

భూకంప తీవ్రత 5.2 గా సంభవించింది 2022-08-20 01:12:47 IST, అక్షాంశం: 28.07 మరియు రేఖాంశం: 81.25, లోతు: 82 కి.మీ, స్థానం: లక్నో, ఉత్తరప్రదేశ్‌లో 139 కి.మీ NNE” , నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భూకంప ప్రభావంతో ఎంత నష్టం జరిగింది తెలియరాలేదు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది. ఎలాంటి నష్టం జరగనప్పటికీ, లఖింపూర్ ఖేరీలోని CCTV ఫుటేజీలో భూకంపం యొక్క చిత్రాలు కనిపించాయి. 6.0 తీవ్రతతో భూకంపం నేపాల్ యొక్క ఖాట్మండును తాకింది.

దీంతో ఉత్తర బీహార్‌లో ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైన భూకంపం తర్వాత ఉత్తరాఖండ్‌లోని పితోర్ ఘర్ ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 12:55 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో మరో భూకంపం జమ్మూ కాశ్మీర్‌లోని హాన్లీ గ్రామానికి నైరుతి దిశలో సంభవించిందని ఎన్‌సిఎస్ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్