Friday, June 12, 2026
Homeసినిమాచ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఈ మూవీ ఆగిపోయింద‌నే టాక్ గత వారం నుంచి  మొద‌లైంది.

 క‌మ‌ల్ హాస‌న్ తో  శంక‌ర్ చేస్తున్న ‘ఇండియన్ 2’ని పూర్తి చేయాల్సి  ఉండడంతో చ‌ర‌ణ్ మూవీని ప‌క్క‌న‌పెట్టార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ మూవీ ఆగిపోవ‌డంతో ‘జెర్సీ’ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేయ‌నున్న‌ట్టుగా కూడా టాక్ వ‌చ్చింది. ఈ విషయంలో డీలాప‌డ్డ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన మెగా కార్నివాల్‌కు దిల్ రాజు హాజరయ్యారు. త్వరలో చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ నుంచి ఒక అప్ డేట్ వస్తుందని ప్ర‌క‌టించిన‌ప్పుడు అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేస్తారా..?   లేక టైటిల్ రిలీజ్ చేస్తారా…? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : చిరు అభిమానికి మెగా అండ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular