Saturday, November 23, 2024
HomeTrending Newsఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదు - కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదు – కవిత

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదన్నారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదని హితవు పలికారు. కేసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతారేమో అని, బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తి వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందన్నారు.

తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో కూడా మా కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేశారని, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇటువంటి వాటికి భయపడేది లేదని తెగేసి చెప్పారు. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తామన్నారు. భయపడేది లేదు… బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

Mlc Kavitha Liquor Scam

ఢిల్లీ మద్యం పాలసీని డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు రూ.150 కోట్ల లంచం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో మంతనాలు జరిపారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పడం కలకలం రేపింది. 6 నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీశ్ సిసోడియాతో పాటు ఆయన అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ హోటల్‌లోనే ఉండి తతంగం నడిపించారని పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బిజెపి నేతలపై పరువు నష్ట దావా వేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై పరువు నష్ట దావా వేయాలని నిర్ణయం. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించనున్న కవిత. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న కవిత

Also Read : ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సిబిఐ సోదాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్