విజయ్ దేవరకొండకి యూత్ తో పాటు మాస్ ఇమేజ్ కూడా ఫుల్లుగా ఉంది. అందుకే ఈ రెండు వర్గాల ప్రేక్షకులు తన నుంచి కోరుకునే అంశాలు తన కథల్లో ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ‘లైగర్’ సినిమాతో ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగించాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. మాస్ పల్స్ తెలిసిన మాస్టర్ గా పేరున్న పూరి జగన్నాథ్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా అనన్య పాండే పరిచయమవుతోంది.

‘లైగర్’ను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో  విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అవుతాడనే బలమైన నమ్మకంతో అభిమానులు ఉన్నారు. నిజంగానే ఆయన ఆ స్థాయి హిట్ కొట్టవలసిందే. ఎందుకంటే ‘టాక్సీవాలా’ తరువాత విజయ్ దేవరకొండ హిట్ అనే మాటనే వినలేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ ఫలితం నిరాశపరిచింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా ఆయన అభిమానులను సంతోష పెట్టలేకపోయింది.

ఇక లాభం లేదు .. సాధ్యమైనంత తొందరగా హిట్ కొట్టవలసిందే అని ఆయన ఆరాటపడ్డాడుగానీ, అనేక కారణాల వలన  ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యమైపోయింది. మరో రెండు రోజుల్లో థియేటర్లకు రానున్న ఈ సినిమా హిట్టు కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.  ఇంతకుముందు పడిన రెండు ఫ్లాపుల గుర్తులను తుడిచేయడానికీ, అభిమానులతో వచ్చిన గ్యాపును భర్తీ చేయడానికి ఈ హిట్ ఆయనకి అత్యవసరం. అలాంటి హిట్ ఈ పాన్ ఇండియా సినిమాతో పడితే  విజయ్ దేవరకొండ కొండను ఇక పట్టుకోవడం కష్టమే

Also Read : లైగ‌ర్ సీక్వెల్ పై హింట్ ఇచ్చిన విజ‌య్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *