Monday, June 8, 2026
HomeTrending Newsసిఎంతో టాటా ప్రతినిధుల భేటీ

సిఎంతో టాటా ప్రతినిధుల భేటీ

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని చెబుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ వారికి వివరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్‌ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీ ఉన్నారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం,  సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Also Read: కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular