Monday, June 29, 2026
Homeస్పోర్ట్స్క్రీడాకారులు బేబి రెడ్డి, అర్షద్ లకు సిఎం ప్రశంసలు

క్రీడాకారులు బేబి రెడ్డి, అర్షద్ లకు సిఎం ప్రశంసలు

ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌ షేక్‌ అర్షద్, కోచ్‌ ఆదిత్య మెహతా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసున్నారు. బేబి రెడ్డి స్వస్ధలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, షేక్‌ అర్షద్‌ స్వస్ధలం నంద్యాల

అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సిఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.  ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్‌ టీమ్‌)లో కాంస్య పతకం గెలిచిన బేబి రెడ్డి టీమ్, తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపించారు. జాతీయ స్ధాయిలో టీమ్‌ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు చెప్పారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించిన షేక్‌ అర్షద్‌. తాను జాతీయ స్ధాయిలో సాధించిన పతకాలను కూడా సీఎంకి చూపి, అక్టోబర్‌లో ఫ్రాన్స్‌ లో జరగనున్న ట్రాక్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొంటున్నట్లు సీఎంకి చెప్పారు.

తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని బేబి రెడ్డి, అర్షద్ విజ్ఞప్తి చేయగా సిఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బేబి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి, అర్షద్‌ కోచ్‌ ఆదిత్య మెహతా ఉన్నారు.

Also Read సిఎం జగన్ ను కలిసిన సింధు, రజని

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular