Friday, June 12, 2026
HomeTrending Newsనేటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

నేటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప వెళ్లనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

రేపు సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద నివాలులర్పించనున్నారు. అదేరోజు పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు.  సెప్టెంబర్‌ 3న  ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular