Thursday, June 11, 2026
HomeTrending Newsనేడు పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’

నేడు పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద వరుసగా నాలుగో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అందించానుని రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న కార్యక్రమంలో సిఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు అందించనున్నారు.

అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్ధిక సాయం అందిచేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019 డిసెంబర్ లో ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ధర్మవరంలో ప్రారంభించారు.  నేడు అందిస్తున్న రూ. 193.31 కోట్లతో కలిపి ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు కేవలం ఈ పథకం ద్వారా  అందించిన మొత్తం సాయం రూ. 776.13 కోట్ల అని ప్రభుత్వం తెలియజేసింది. వీటితో పాటు నేతన్నల పెన్షన్‌ కోసం రూ. 879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించింది రూ. 393.3 కోట్లు కలిపి ఈ మూడేళ్ళలో నేతన్నల సంక్షేమం కోసం వెచ్చించిన మొత్తం రూ. 2,049.2 కోట్లు.

చేనేత కార్మికులు ఈ ఆర్ధిక సహాయంతో తమ మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసి క్రొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం వల్ల 2018 – 19 లో రూ. 4,680 గా ఉన్న వారి నెలవారీ ఆదాయం…పథకం అమలు తర్వాత 3 రెట్లు పెరిగి రూ. 15,000కు చేరింది

ఆప్కో వస్త్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్ధలైన అమేజాన్, మింత్ర, ప్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, మిర్రా, పేటీఎం వంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం, తద్వారా ఆప్కో వస్త్రాలకు పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular