Thursday, March 28, 2024
HomeTrending Newsనేతన్న సంక్షేమంలో కోత: లోకేష్

నేతన్న సంక్షేమంలో కోత: లోకేష్

నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తి వేసిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకైక పథకం నేతన్న నేస్తం కూడా అందరికీ ఇవ్వడంలేదని, ఎన్నో నిబంధనలు పెట్టి కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

“చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం పథకాలను కట్ చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో చేనేతల సంక్షేమం కోసం అమలైన అనేక కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది. అరకొరగా కేవలం 20 శాతం మందికే అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం లబ్దిదారుల్లో మరింత కోత పెట్టేందుకు నూలు బిల్లు తప్పనిసరనే నిబంధన పెట్టడం దారుణం. కఠిన నిబంధనలు వెనక్కి తీసుకొని నేతన్న నేస్తం చేనేత కళాకారులందరికీ అమలు చెయ్యాలి. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా విధిస్తున్న జిఎస్టి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి” అంటూ సామాజిక మాధ్యమాల్లో లోకేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్