Monday, June 15, 2026
Homeసినిమాలోకేష్ తో చ‌ర‌ణ్ మూవీ ఫిక్స్?

లోకేష్ తో చ‌ర‌ణ్ మూవీ ఫిక్స్?

ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించి మెప్పించారు. దీంతో నార్త్ లో సైతం చరణ్ కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ  క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగానే సినిమ‌లు చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. ప్ర‌స్తుతం  శంక‌ర్ డైరెక్ష‌న్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

అయితే.. శంక‌ర్  మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేయాలనుకున్నారు. అఫిషియ‌ల్ గా అనౌన్స్ కూడా చేశారు.అయితే… ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని తెలిసింది. మ‌రి.. శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారంటే.. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు సంచలన విజయాలు సాధించ‌డంతో లోకేష్ కు డిమాండ్ బాగా పెరిగింది.  ప్రస్తుతం ఆయన విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు. లోకేష్‌ తో తన నెక్స్ట్ మూవీ ఉండేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో తన ఫస్టు మూవీ చరణ్ తో ఉండొచ్చునని లోకేష్  కూడా చెప్పారు. దాంతో ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాల కంటే ముందు, చరణ్ తో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి.. త్వ‌ర‌లో అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular