పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’. ఈ చిత్రాన్ని మ‌హేష్ బాబుతో చేయాలనుకున్నారు.  మ‌హేష్ కు కథ కూడా నచ్చింది. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆ త‌ర్వాత వెంక‌టేష్ తో చేయాలి అనుకున్నా  అది కూడా కుదరలేదు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, య‌ష్ ల‌కు కూడా జ‌న‌గ‌ణ‌మ‌న స్టోరీ  చెప్పినా ఫలితం లేకపోయింది. ఆఖ‌రికి విజ‌య్ దేవరకొండతో తో సెట్ అయ్యింది. ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అయితే.. లైగ‌ర్ మూవీ ప్లాప్ అవ్వ‌డంతో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం డౌట్ లో ప‌డింది.

విజ‌య్ ‘ఖుషి’ త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతానికి జ‌న‌గ‌ణ‌మ‌న ఆగింది. అందుచేత పూరి ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ 2 చేయాలి అనుకుంటున్నార‌ట‌. లైగ‌ర్ ప్లాప్ త‌ర్వాత ముంబాయి వెళ్లిన పూరి ఇస్మార్ట్ శంక‌ర్ 2 స్టోరీ రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. ఈసారి లెక్క త‌ప్ప‌కుండా ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నార‌ట‌.

ఈ సినిమాని జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని నిర్మిస్తున్న మైహోమ్ సంస్థ‌కి చేయ‌నున్నార‌ని స‌మాచారం. పూరి జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంకర్ 2 చేసిన తరువాత జ‌నగణమన సినిమా గురించి ఆలోచిస్తారేమో? అయినా ఏమిటో పాపం, ఆ జ‌నగణమన సినిమా పూరికి అచ్చి వస్తున్నట్లు లేదు. ఎప్ప‌టి నుంచో ఈ చిత్రాన్ని చేయాలనుకుంటున్నారు కానీ… అది తెరకెక్కించాలనుకుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూనే వుంది.  మ‌రి.. పూరి డ్రీమ్ జ‌న‌గ‌ణ‌మ‌న ఎప్ప‌టికి పూర్త‌వుతుందో.. ఎవ‌రితో చేస్తారో.. చూడాలి.

Also Read :‘జ‌న‌గ‌ణ‌మ‌న’ పరిస్థితి ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *