విజ‌య్ దేవ‌ర‌కొండ‌,  పూరి జ‌గ‌న్నాథ్ ల కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ లైగ‌ర్.  విడుదలకు ముందు విపరీతమైన హైప్ వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

అయితే.. వీరిద్దరి కాంబినేష‌న్లోనే మ‌రో మూవీ ‘జ‌న‌గ‌ణ‌మ‌న’  ఇప్పటికే మొదలు పెట్టారు. ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం ఉంటుందా..? ఉండ‌దా..? అనేది ఆస‌క్తిగా మారింది. జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం ఆగిపోయింద‌ని ఆల్రెడీ వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ సినిమాలో మైహోమ్ సంస్థ కూడా భాగస్వామి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేయడం సరికాదు అని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరో ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ నిర్మాణ భాగస్వామి చార్మికి చెప్పేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రస్తుతం ఖుషీ సినిమాకి కూడా గ్యాప్ ఇస్తున్న‌ట్టు టాక్. ఖుషి సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత కానీ  జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం పై క్లారిటీ రాదు. మ‌రి.. మేక‌ర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : అయ్యో పాపం .. అనన్య   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *