Saturday, April 5, 2025
Homeస్పోర్ట్స్ICC Awards: ప్లేయర్ అఫ్ ద మంత్ రేసులో స్టోక్స్, సికందర్, శాంట్నర్

ICC Awards: ప్లేయర్ అఫ్ ద మంత్ రేసులో స్టోక్స్, సికందర్, శాంట్నర్

ఆగస్ట్ నెలకు సంబంధించి ఐసిసి ప్లేయర్ అఫ్ ద మంత్ రేసులో ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా, న్యూ జిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ లు నామినేట్ అయ్యారు.

ఆగస్ట్ చివరి వారంలో న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన రెండో టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లతో పాటు 103 పరుగులతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ , 85 పరుగులతో విజయం సాధించింది. స్టోక్స్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ కూడా దక్కించుకున్నాడు.

జింబాబ్వే ఆటగాడు రాజా గత కొంత కాలంగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలి ఇండియా, బంగ్లాదేశ్ లతో జరిగిన సిరీస్ ల్లో  రాణించాడు.

కివీస్ ఆటగాడు శాంట్నర్ గత నెలలో సత్తా చాటాడు. నెదర్లాండ్స్ తో జరిగిన సిరీస్ లో అద్భుతంగా రాణించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్