Friday, June 12, 2026
Homeసినిమా‘కబాలి’ ధన్సిక ప్రధాన పాత్రలో ‘దక్షిణ’

‘కబాలి’ ధన్సిక ప్రధాన పాత్రలో ‘దక్షిణ’

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ రూపొందించిన  ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో  పాటు రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు.  హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో  జరిగిన  ముహూర్తం షాట్ కు ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ అతిథిగా విచ్చేసి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ… ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది.  ఆ సినిమాల తరహాలో ‘దక్షిణ’ ఉంటుంది. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాం. తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు జరుగుతుంది. రెండో షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 6 నుంచి 20వ తేదీ వరకు ప్లాన్ చేశాం. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. నటీనటులతో పాటు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular