మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ సాధిస్తున్న నాగ‌చైత‌న్యకు  ఇటీవ‌లి  ‘థ్యాంక్యూ‘తో బ్రేక్ పడింది. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది.  లాల్ సింగ్ చ‌డ్డా అనే సినిమాలో అమీర్ ఖాన్ తో క‌లిసి చైతూ నటించగా అది కూడా ఘోరంగా విఫలమైంది.

నెల గ్యాప్ లోనే రెండు ప్లాపులు రావ‌డంతో చైత‌న్య డీలా పడ్డాడు. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో నాగ‌చైత‌న్య తెలుగు, త‌మిళ్ మూవీ చేస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న కృతి శెట్టి న‌టిస్తుంది. ఈ మూవీకి ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తుండ‌డం విశేషం.

నాగ చైతన్య కెరీర్ లోనే ఇప్పటివరకు సోలో హీరోగా నటించిన సినిమాలకు ఖర్చు పెట్టనంత ఎక్కువ  బడ్జెట్ తో దీన్రూని రూపొందిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. మ‌రి.. చైత‌న్య కోలీవుడ్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..?  ఆశించిన విజ‌యం వ‌స్తుందా..? అనేది చూడాలి.

Also Read : థ్యాంక్యూ ఎఫెక్ట్ ప‌ర‌శురామ్ పై ప‌డిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *