Wednesday, June 17, 2026
Homeసినిమాకొర‌టాల‌కు క్లారిటీగా చెప్పేసిన ఎన్టీఆర్

కొర‌టాల‌కు క్లారిటీగా చెప్పేసిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. ‘ఆచార్య‘ ఫ్లాప్ తో ఆల‌స్యం అయ్యింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే షూటింగ్  మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేశార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. కొరటాల శివ సినిమా ప్రొడక్షన్, వ్యాపార లావాదేవీల్లో  కూడా తన పాత్ర ఉండేలా వ్యవహరిస్తారు అయితే.. ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడే ఏమి చేసినా చెల్లుతుంది. అదే.. ఫ్లాప్ వస్తే ఎక్స్ ట్రాలు అవ‌స‌ర‌మా అని ముఖం మీదే చెప్పేస్తారు.  కొరటాల విషయంలో అదే జరిగింది. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాల్లో కొర‌టాల శివ బిజినెస్ లో కూడా కలగచేసుకొని హడావిడి చేశారు. ‘ఆచార్య’లో మేకింగ్ పక్కన పెట్టి బిజినెస్ లెక్కలలో ఎక్కువ కాన్ స‌న్ ట్రేష‌న్ చేశారట.

ఆ సినిమా నష్టాలు తీర్చేందుకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే.. ఎన్టీఆర్.. త‌న సినిమా విషయంలో ఇవన్నీ ఉండకుండా చేసినట్లు టాక్. ఈ సినిమా స్టోరీ, డైరెక్క్షన్ కి మాత్రమే పరిమితం అవ్వాలని…. నిర్మాణం, వ్యాపార లావాదేవీలు సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ చూసుకుంటారని కొరటాలకు  నిర్మొహమాటంగా చెప్పారని తెలిసింది.

Also Read: ఆచార్య ఎఫెక్ట్.. కొర‌టాల కీల‌క నిర్ణ‌యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular