Friday, May 31, 2024
Homeసినిమాఆచార్య తొలి రోజు క‌లెక్ష‌న్ ఎంత‌?

ఆచార్య తొలి రోజు క‌లెక్ష‌న్ ఎంత‌?

Collections:  మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్గే నటించింది. భారీ అంచ‌నాల‌తో ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ఈ చిత్రానికి ఫ‌స్ట్ డే నుంచే డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌రి.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే…
నైజాం – 7.90 కోట్లు, సీడెడ్ – 4.60 కోట్లు, ఉత్త‌రాంధ్ర – 3.61 కోట్లు, ఈస్ట్ – 2.53 కోట్లు, వెస్ట్ – 2.90 కోట్లు, గుంటూరు – 3.76 కోట్లు, కృష్ణా – 1.90 కోట్లు, నెల్లూరు – 2.30 కోట్లు తెలుగు రాష్ట్రాలైన‌ ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆచార్య తొలి రోజున 29.50 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్ సీస్ అంతా క‌లిపితే ఆచార్య సినిమాకు 35 కోట్లు పైనే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే.. టాక్ డివైడ్ గా ఉండ‌డంతో ఫ‌స్ట్ వీక్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్