Sunday, June 14, 2026
HomeTrending Newsకనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదు

కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదు

తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే కారణం మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఇక్కడ వాతావరణం చూసి మిగతా ప్రాంతాలలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు.

Also Read : పది,ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular