Friday, March 29, 2024
HomeTrending Newsపంట మార్పిడితో అధిక దిగుబడులు: ఎమ్మెల్యే గండ్ర

పంట మార్పిడితో అధిక దిగుబడులు: ఎమ్మెల్యే గండ్ర

Crop Rotation : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.
నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంట‌ల‌ను వేయాల‌ని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో అధిక లాభాలు పొందొచ్చన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో మిర్చి పంటను సాగుచేసే రైతులు ఇక్కడనే మిర్చి నారు మడులు తయారు చేసుకొని మొక్కలను పెంచుకుంటే చీడపీడల కాకుండా వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చ‌న్నారు. ఇతర ప్రాంతాల నుండి మిర్చి పంట నారును తేవడం వల్ల వైరస్ అధికమవుతుంద‌ని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి తెలిపారు.

Also Read : కిలో కూడా తరుగు తీయోద్దు: మంత్రి గంగుల

RELATED ARTICLES

Most Popular

న్యూస్