Friday, January 24, 2025
HomeTrending Newsజాతీయ రాజకీయాల్లో కెసిఆర్.. చారిత్రక అవసరం - జగదీష్ రెడ్డి

జాతీయ రాజకీయాల్లో కెసిఆర్.. చారిత్రక అవసరం – జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకీ రావడం చారిత్రక అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కుడా అదే విధంగా ఉందన్నారు. నల్గొండలో ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అని అధికారంలో ఉన్న బిజెపి మత వైషమ్యాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. దేశఅభ్యున్నతికి ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యమని. ఇప్పుడు యావత్ దేశం చూపు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉందన్నారు.

తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో వెనుక బడుతున్న దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Also Read : ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే జగదీష్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్