Sunday, January 19, 2025
HomeTrending Newsపాదయాత్ర విజయవంతం అవుతుంది: జవహర్

పాదయాత్ర విజయవంతం అవుతుంది: జవహర్

అమరావతిపై మరోసారి కుట్రలకు తెరతీస్తున్నారని మాజీమంత్రి, టిడిపి నేత కె. జవహర్ ఆరోపించారు.  సిఆర్డీఏ పరిధిని కుదించి మున్సిపల్ అథారిటీని తీసుకు వచ్చేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.  సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సిఎం జగన్ ఆ తర్వాత అవగాహన లేకుండా హామీ ఇచ్చారని చెప్పడం దారుణమని చెప్పారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి ఇప్పుడు 25 ఏళ్ళకు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. అమరావతి, సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం అంశాలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ నిర్ణయాలకు మొదట బలైంది అమరావతి రైతులేనని, అప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేశారని…హైకోర్టు కూడా ఆరు నెలలు సమయం ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పిందని జవహర్ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధికి ఆరు నెలలు సరిపోదని ఆరేళ్ళు సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించి చేతులెత్తిందాని వ్యాఖ్యానించారు.  అమరావతి- అసరవిల్లి పాదయాత్రకు అమరావతి రైతులు సిద్ధమవుతుంటే  దాన్ని దండయాత్రగా మంత్రులు చెప్పడం భావ్యం కాదన్నారు.

కొడాలి నానికి విజ్ఞత, జ్ఞానం, కుటుంబం… పెద్దలు అంటే గౌరవం లేదని.. అతని గురించి మాట్లాడక పోవడమే మంచిదన్నారు. సీదిరి అప్పలరాజు తన నియోజకవర్గంలోనే మహిళలతో ఎలా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలుసనీ జవహర్ వివరించారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎదుటి వారిని తిట్టడం, తిరిగి తిట్టించుకోవడం అలవాటైపోయిందన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించనుందని, వైజాగ్ ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని, మహా పాదయాత్ర విజయవంతం అవుతుందని జవహర్ జోస్యం చెప్పారు.

Also Read : అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్