Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఖతార్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 13-15 తేదీలలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ వలసలు, కార్మికుల స్థితిగతులపై ప్రపంచ దేశాలు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాయి.  కార్మికులను పంపించే, స్వీకరించే దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం అనంతరం కీలకమైన ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరలో 2022 ఖాతర్ దేశంలో ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికుల హక్కుల పరిరక్షణ, వలసల కోసం భవిష్యత్తు కార్యాచరణ అనే అంశాలపై జరుగుతున్న ఈ సమావేశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది.

డిసెంబర్ 2018 లో 152 సభ్య దేశాలు గ్లోబల్ కాంపాక్ట్ అమలుపై అంతర్గత – ప్రాంతీయ సంభాషణ క్రమం ఆసియా – గల్ఫ్ దేశాల సంభాషణ, గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ జి సి యం అనేది అంతర్జాతీయ వలసలను అన్ని కోణాలలో పరిష్కరించడానికి, వలసలపై అంతర్జాతీయ సహకారం, నూతన దృక్పథాన్ని అందించడానికి మొదటి అంతర్ ప్రభుత్వ కార్యాచరణ వేదిక. మే నెల 2022 లో మొదటి అంతర్జాతీయ వలసల సమీక్ష వేదిక సమావేశం న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగింది. గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ ప్రధానమైన 23 లక్ష్యాలు, మార్గదర్శక సూత్రాలతో సహా జి.సి.ఎం అమలులో పురోగతిని చర్చించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ప్రాథమిక వేదిక .

గల్ఫ్ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు ప్రధాన గమ్యస్థానాలలో ఒకటి, ఇటీవలి సంవత్సరాలలో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో వలస వచ్చిన వారిలో చాలా మంది నిర్మాణం, ఆతిథ్యం, ఇంటి పని వంటి రంగాలలో తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం, 2020లో 30 మిలియన్లకు పైగా వలస కార్మికులు గల్ఫ్ ప్రాంతంలో నివసించడం, పని చేయడం జరుగుతుంది. గల్ఫ్ ప్రాంతంలోని వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులలో 10 శాతానికి పైగా ఉన్నారు, వలస అనే పదం ఒక గొడుగును పోలి ఉంది, గతంలో వలస అంతర్జాతీయ చట్టం ప్రకారం ఖచ్చితంగా నిర్వచించబడలేదు. ఇది అతడు లేదా ఆమె సాధారణ నివాస స్థలం నుండి దూరంగా వెళ్ళే వ్యక్తి సాధారణ అవగాహనను ప్రతిబింబిస్తుంది, ఒక దేశంలో లేదా అంతర్జాతీయ సరిహద్దులో, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వివిధ కారణాల వల్ల 2020 సంవత్సరం మధ్యలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరుసగా ప్రపంచంలోని మూడవ, ఐదవ అతిపెద్ద వలస జనాభాకు ఆతిథ్యం ఇస్తున్నాయి.(అంతర్జాతీయ కార్మిక సంఘం లెక్కల ప్రకారం ) గల్ఫ్ దేశాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో వలసదారులకు (2020 మధ్య నాటికి 22.8 మిలియన్లు) ఆతిథ్యం ఇస్తున్నాయి. (యూనైటెడ్ నేషన్స్ – డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, వలస కోసం పని చేసే అంతర్జాతీయ సంస్థ 2020 నుండి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్మికుల వలసలో అమోఘమైన మార్పులను ఎదుర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com