Sunday, November 24, 2024
HomeTrending Newsకెనడా హిందూ గుడిలో ఖలిస్తానీల ఆగడాలు

కెనడా హిందూ గుడిలో ఖలిస్తానీల ఆగడాలు

కెనడా  వాణిజ్య నగరం టొరంటోలోని ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయంలో హిందూ వ్యతిరేక గోడ రాతలు వివాదాస్పదం అయ్యాయి. బోచన అక్షర పురుషోత్తమ స్వామీ నారాయణ్ (BAPS) ఆలయంలో భారత్ కు వ్యతిరేకంగా కొందరు ఆగంతకులు దేవాలయ గోడలపై నినాదాలు రాశారు. దీనిపై భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కెనడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన భారత దౌత్య కార్యాలయం నిరసన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక వార్తలు రాసిన వారిని, దేవాలయ అపవిత్రతకు కారణమైన వారిపై కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోడ రాతలకు ఖలిస్తాని అనుకూల వాదులే ఒడిగట్టారని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన టొరంటో మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక శక్తులకు టొరంటోలో స్థానం లేదని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు విచారణ చేపట్టారని నిందితుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు స్వామి నారాయణ్ గుడి ఘటనపై కెనడా ఎంపి చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక ప్రచారం పేరుతో హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. హిందూ మతాన్ని అవమానించే విధంగా కెనడాలో ఇటీవల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వామి నారాయణ్ గుడి ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి సోనియా సిద్దు ఘటనపై సీరియస్ అయ్యారు. పరమత సహనం కోల్పోయి కెనడా ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్న ఆగంతకులను గుర్తించి కటినంగా శిక్షించాలని సోనియా సిద్దు డిమాండ్ చేశారు.

కెనడాలో ఖలిస్తానీ అనుకూల వాదుల ఆగడాలు శృతి మించుతున్నాయి. భారత్, పాక్ నుంచి వెళ్ళిన సిక్కులు ఇటీవల ప్రత్యేక ఖలిస్తాన్ కోసం కార్యక్రమాలు చేపట్టడం పెరిగింది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసినపుడు కూడా కెనడాలోని సిక్కులే ఎక్కువగా నిరసన వ్యక్తం చేశారు. ఖలిస్తానీలకు పాకిస్తాన్ అండ ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది.

Also Read : భారత విద్యార్థులకు కెనడా విసా జారీలో జాప్యం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్