Saturday, November 23, 2024
HomeTrending Newsభూకంపంతో తైవాన్ లో భారీగా ఆస్తినష్టం

భూకంపంతో తైవాన్ లో భారీగా ఆస్తినష్టం

తైవాన్​ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వచ్చిన భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని వెల్లడించారు. యుజింగ్ జిల్లాలో ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది. వాయువ్య ప్రాంతంలోని తైతుంగ్ కౌంటీలో 7.3  తీవ్రతతో భూకంపం వచ్చింది. యూలీలోని ఓ రహదారి పైనున్న వంతెన​ నేలమట్టమైంది. ఆ సమయంలో బ్రిడ్జ్​పై వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకోగా రక్షణ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తూర్పు ‘తైవాన్‌’లోని డోంగ్లీ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ పై కొంత భాగం కూలిపోవడంతో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రాజధాని తైపీలో కొద్దిసేపు భవనాలు కంపించాయి 2016వ సంవత్సరంలో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు.

అదే ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒక్కరిని సురక్షితంగా బయటకు తీయగా మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాయున్​ పట్టణంలోని ఓ స్పోర్ట్స్​ సెంటర్​లోని ఐదవ అంతస్తులో ఉన్న గది సీలింగ్​ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ 36 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు.

‘ఆరెంజ్ డే లిల్లీస్‌’కు ప్రసిద్ధి చెందిన యులిలోని పర్వతంపై కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. విద్యుత్​ లేక, ఫొన్​ సిగ్నల్స్​ దొరకక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. మరోవైపు.. తైవాన్ సమీపంలోని అనేక దక్షిణ జపాన్​ దీవులకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వాటిని తర్వాత ఉపసంహరించుకుంది.

Also Read: తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆగడాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్