Saturday, November 23, 2024
HomeTrending Newsదేశం కేసీఆర్ వైపు చూస్తోంది - మంత్రి జగదీశ్ రెడ్డి

దేశం కేసీఆర్ వైపు చూస్తోంది – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ కుటుంభ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల వరకే ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నామని అన్నారు. ఒక్క మునుగోడులోనే కాదు రాష్ట్రమంతట ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం మొత్తానికి ఒక తండ్రి లాగా కేసీఆర్ ఉన్నాడని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే టీడీపీలో ఉన్న కేసీఆర్ ప్రశ్నించడం మొదలుపెట్టాడని గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని వాదోద్దని అప్పటి సీఎం చంద్రబాబు ఆంక్షలు పెట్టాడని.. కేసీఆర్ చచ్చడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు.
కేసీఆర్ రోజుకు 20 గంటలు పని చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను మార్చిండని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. భారత దేశంలోనే నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని గొప్ప చరిత్రగా నిలిచిందన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రపంచంలోనే మొదట దళిత బంధు పథకం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. దేశంలో40 ఏళ్లలో ఏ పార్టీ చేయాలేని అభివృద్ధి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 8 ఎండ్లలో చేసి చూపించిందని మంత్రి చెప్పారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని..కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.

Also Read: రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా మంత్రి జగదీశ్‌రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్