పైరవీల నిలయం ప్రగతిభవన్- ఈటల రాజేందర్

ధరణి రైతాంగం కోసం పెట్టారా ? కెసిఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి ప్రగతి భవన్ తో సంబందం ఉన్న వ్యక్తుల ప్రమేయంతో.. నిషేధిత జాబితా నుండి మారిపోయింది. సీఎం నుండి cs కి అక్కడి నుండి కలెక్టర్ కి చెప్పి చేయించుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ సిఎం కెసిఆర్ తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రగతిభవన్ పైరవీల నిలయమని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు.

శోధించి, సాధించినట్టు గంభీరస్వరంతో భూ రికార్డ్ సరిచేస్తా అని కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
భూరికార్డ్ సరిగా ఉంటే gdp, gsdp 2% అధికంగా ఉంటుంది అని చెప్తే ప్రజలు అందరు సంతోషించారు. భూ ప్రక్షాళన 2 ఏళ్లలో చేసి చూపిస్తా అన్నారు. ఆ టైంలో భూ ప్రక్షాళన జగిత్యాలలో 97 % భూ ప్రక్షాళన జరిగింది అని కలెక్టర్ సీఎం కి చెప్పారు. ఇది అబద్దం అని అప్పుడే నేను చెప్పాను. కలెక్టర్లు ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి అంతా అయిపోయింది అని చెప్పారు. కెసిఆర్ కూడా మెచ్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక నెల జీతం బోనస్ కూడా ఇచ్చారు.

ఆ తరువాత సమస్యలు రావడంతో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఆ పాపం అంత రెవెన్యూ వారిదే అని
తన విషపుత్రిక నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరుతో అనేక కథనాలు రెవెన్యూ డిపార్ట్ కి వ్యతిరేకంగా వార్తలు రాయించి, ప్రజల చేత ఛీ కొట్టించి, బోనుకు ఎక్కుంచారు. ఎలుకల బాధకు ఇళ్ళు తగలబెట్టే పనిచేశారు.
మహిళా mro మీద పెట్రోల్ పోసి తగబెట్టడనికి కారకుడు కెసిఆర్.

2020 అక్టోబర్ లో ధరణి తీసుకొచ్చి, కలెక్టర్, జెసి , rdo లకు ఉన్న అధికారాలు అన్నీ తీసివేశారు. లక్షలాది మంది రైతులు దరణితో ఇబ్బంది పడుతున్నారు. రకరకాల ఇబ్బందులతో 24 లక్షల దరఖాస్తు వస్తె కేవలం 6 లక్షల దరకస్తులు మాత్రమే పరిష్కరించారు. 18 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ధరణి ఇబ్బందులతో నిన్న ఒక్క రోజే.. 4 చోట్ల నలుగురు ఆత్మహత్యయత్నం చేశారు.

మహబూబ్ బాద్ జిల్లా నారాయణపూర్ గ్రామం మెత్తం వివాదాస్పద భూజాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఉన్న రైతులకు రైతుభందు రాక, బ్యాంక్ లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ధరణి వివాదాల వల్ల హత్యలు జరుగుతున్నాయి. తాతల కాలంలో అమ్ముకున్న భూములు మళ్లీ వారిపెరు మీద వచ్చాయి. వాటిని ఇతరులకు అమ్ముకోవడంతో వివాదాలు పెరుగుతున్నాయి. ధరణి సమస్యలు పరిష్కారం చేసే దమ్ము లేదంటే వెంటనే తప్పుకోవాలని కెసిఆర్ ను డిమాండ్ చేశారు.

ప్రాజెక్ట్ కమీషన్ల కంటే ధరణి కుంభకోణం పెద్దది. భూములు కెసిఆర్, ఆయన కుటుంబ కబ్జాలోకి వెళ్తున్నాయి.
బేరం కుదిరితే లాక్ ఓపెన్ చేస్తున్నారు. లేదంటే క్లోజ్ చేస్తున్నారు. దీని డిజైనర్ కెసిఆర్.. ధరణి భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలి. లేదంటే పరిపాలించే నైపుణ్యం లేదు అని రాజీనామా చెయ్యాలి. అసైన్మెంట్ భూములు వేల ఎకరాల భూమి వీరి బినామీల పేరుమీదే మార్చుకుంటున్నారు. భూ ప్రక్షాళన, ధరణి విఫలం అయ్యింది అని ఒప్పుకోండి. భూ రికార్డ్స్ నాలుగు కంపెనీలకు మార్చిన కెసిఆర్, ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశ కంపెనీ కి ఇచ్చి మన భవిష్యత్తు వారి చేతిలో పెట్టారు అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రకాష్ రెడ్డి, సుభాష్, కొప్పు భాష, కట్టా సుధాకర్, సుధాకర్ శర్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *