Friday, June 12, 2026
HomeTrending Newsహాస్టళ్ళ నిర్వహణకు ప్రత్యేక అధికారులు: సిఎం

హాస్టళ్ళ నిర్వహణకు ప్రత్యేక అధికారులు: సిఎం

గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహారాలు పర్యవేక్షణ బాధ్యతను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓలే ఆ మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్‌ బాధ్యతలు చూస్తారన్నారు. సంక్షేమ హాస్టళ్లపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు – నేడు పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని అధికారులకు సూచించారు. మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలని, దీనికోసం ప్రత్యేక యాప్‌కూడా రూపొందించాలని అన్నారు. మౌలిక సదుపాయాలు, భోజనంనాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు

 గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో రెండు విడతలుగా నాడు – నేడు పనులు చేయాలని సిఎం ఆదేశించారు.  పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైన, డ్రైనేజీని లింక్‌ చేయడంపైన దృష్టిపెట్టాలని నిర్దేశించారు. హాస్టల్‌ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా  వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలని, విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు

Also Read ఏజెన్సీలో ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ : సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular