Saturday, April 20, 2024
Homeసినిమా'జాన‌కిరామ్' సెన్సార్ పూర్తి

‘జాన‌కిరామ్’ సెన్సార్ పూర్తి

కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ  జంట‌గా రూపొందిన చిత్రం ‘జానకిరామ్’. బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ ఓబులేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాంప్ర‌సాద్ ర‌గుతు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌టం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

నిర్మాత మాట్లాడుతూ “ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హ్యుమ‌న్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన చిత్రమిది. కీర్తి సురేష్ హీరోయిన్ గా, న‌రేష్ గారి త‌న‌యుడు న‌వీన్ కృష్ణ‌ హీరోగా న‌టించారు. అచ్చు రాజ‌మ‌ణి గారు ఏడు అద్భుత‌మైన పాట‌లు కంపోజ్ చేశారు.  మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారు కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు. ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన రాంప్ర‌సాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు.  ఇందులో స‌ప్త‌గిరి, పోసాని, రాహుల్ దేవ్ , ర‌ఘు కారుమంచి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని న‌టించింది. త్వ‌ర‌లో సినిమా విడుదల తేదీ ప్ర‌క‌టిస్తాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్