హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదైంది. ఆఫ్ లైన్ టిక్కెట్ల అమ్మకం సందర్భంగా నిన్న తొక్కిసలాట ఘటనపై సెక్షన్ 420, 337, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ 21/76 కింద కేసు నమోదు చేశారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ ఈ ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. HCA ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ నిర్వహణపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్ టిక్కెట్లు ఎప్పటినుంచి విక్రయిస్తారో కూడా ముందస్తుగా ప్రకటించలేదు. క్రీడాభిమానులు, తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో నిన్న ఉదయం (22న) పది గంటల నుంచి విక్రయించాలని నిర్ణయించింది. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు మొన్నరాత్రి నుంచే గ్రౌండ్స్ కు చేరుకున్నారు. HCA కేవలం రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ సిబ్బందితో పాటు ఐదుగురు పౌరులు గాయపడ్డారు. వీరిని వెంటనే యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ ఘనకు సంబంధించి సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.