Sunday, March 8, 2026
HomeTrending Newsపుష్కర్ సింగ్ దామి ప్రమాణం

పుష్కర్ సింగ్ దామి ప్రమాణం

పుష్కర్ సింగ్ దామి ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ రాజ్ భావాన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ సింగ్ మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్ రావత్ మంత్రివర్గంలో పనిచేసిన అందరికీ తాజా కేబినేట్ లో చోటు సంపాదించారు. మాజీ ముఖ్యమంత్రులు తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దామి తో పాటు మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలియజేశారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి, పురోగతికి కృషి చేయాలని ట్విట్టర్ సందేశం ద్వారా ఆకాంక్షించారు.

ఉదంసింగ్ నగర్ జిల్లా ఖటిమ నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు నెలల్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు మారగా మూడో సిఎం గా పుష్కర్ వస్తున్నారు. సామాన్య బిజెపి కార్యకర్తగా ఉన్న తనకు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని పార్టీ నాయకత్వానికి పుష్కర్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular