అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల సంచలనం ‘పుష్ప‘. ఈ సినిమా దేశ విదేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీజనాలు. అయితే.. పుష్ప 1 తో వచ్చిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా పుష్ప 2 స్టోరీ రెడీ చేశారు. చాలా రోజులు సుకుమార్ అండ్ టీమ్ కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి స్టోరీకి అందరూ సంతృప్తి చెందిన తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.
కానీ.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే అల్లు రామలింగయ్య జయంతి రోజైన అక్టోబర్ 1న స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే… అల్లు రామలింగయ్య పేరుతో అల్లు స్టూడియోస్ నగర శివార్లో నిర్మిస్తున్నారు. ఈ స్టూడియోలోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియోస్ ని ఓపెనింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2 బడ్జెట్ విషయానికి వస్తే… ఇంతలో కంప్లీట్ అవ్వాలనే పరిమితులు ఏమీ పెట్టుకోలేదట మేకర్స్. కొంత షూటింగ్ విదేశాల్లో కూడా ప్లాన్ చేశారట. ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వచ్చినప్పటికీ.. పుష్ప 2 అంతకు మించి అనేలా ఉంటుందట. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులును బ్రేక్ చేసి పుష్ప రాజ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని టీమ్ గట్టి నమ్మకంగా ఉన్నారు. మరి.. బన్నీ, సుక్కు ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.
Also Read : పుష్పకి ఇన్ స్పిరేషన్ ఎవరో చెప్పిన సుక్కు