Friday, June 12, 2026
HomeTrending Newsఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సాయంత్రం శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మధ్యాహ్నం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుపతి నుంచి తిరుమలకు టిటిడి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు.

Also Read : సిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular