Thursday, March 19, 2026
Homeసినిమానా కల నేరవేరింది : స‌త్య‌దేవ్

నా కల నేరవేరింది : స‌త్య‌దేవ్

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన‌ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ల పై ఆర్.బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఈ సంద‌ర్భంగా స‌త్య‌దేవ్ మాట్లాడుతూ… అన్నయ్య (చిరంజీవి ) లంచ్ కి రమ్మని పిలిచారు వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీర అభిమానిని. నేను గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది.

ఆయన నా వంక చూసి ”నేను సరిగ్గా కథ చెప్పడం లేదా ? పోనీ దర్శకుడితో చెప్పించనా ?” అని అడిగారు. ”మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా వుంది. నాకేం అర్ధం కావడం లేదన్నయ్యా. మీరు చేయమని చెప్తే చేసేస్తాను. మీరు కథ చెప్పడం ఏంటి ” అన్నాను. సినిమా చూశావా ? అని అడిగారు. ”చూడలేదు, చూడను కూడా. చేసేస్తాను” అని చెప్పా. ఆయన అడిగిన తర్వాత మళ్ళీ చూసే ఆలోచనే లేదు. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో వున్న లోతు కొంచెం కొంచెం అర్ధమైయింది. చిన్న టెన్షన్ కూడా మొదలైయింది(నవ్వుతూ).

నాకు ఊహ తెలిసినప్పటినుండి అన్నయ్యని ఇష్టపడ్డాను. యాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆయన పై వున్న ప్రేమని ఇంధనంగా వాడుకొని నటుడిని అయ్యాను. అన్నయ్య నా నటనని ప్రశంసించడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. నా కల నేరవేరింది. మాటల రచయిత లక్ష్మీ భూపాల హాయిగా మాటలు రాసేశారు. మోహన్ రాజా గారు మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్తారు. వీళ్ళందరికంటే వార్ లో వున్నది నేను (నవ్వుతూ). అయితే అన్నయ్య చాలా చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచారు. ఆయన షాట్ అయిపోయిన తర్వాత కూడా నాకు హెల్ప్ చేయాలని నా పక్కనే వుండేవారు.

అయితే ఆయన పక్కన వుంటే నాకు టెన్షన్ (నవ్వుతూ). నా నెక్ట్స్ మూవీస్ గురించి చెప్పాలంటే.. గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు విడుదలకు సిద్దంగా వున్నాయి. ఫుల్ బాటిల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఈశ్వర్ కార్తిక్ దర్సకత్వంలో డాలీ ధనుంజయ తో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.

Also Read  ‘గాడ్ ఫాదర్’ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular