Thursday, April 18, 2024
Homeసినిమా'ఓరి దేవుడా’ నుంచి మెలోడి సాంగ్ విడుదల

‘ఓరి దేవుడా’ నుంచి మెలోడి సాంగ్ విడుదల

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతుండ‌డం విశేషం. ఓరి దేవుడా’ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ‘ఔననవా..’ అంటూ సాగే మెలోడి సాంగ్ విడుదల చేసింది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. విజ‌య్ ఈ చిత్రాన్ని ఎడిట‌ర్‌గా, విదు అయ్య‌న్న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read : మొత్తానికి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్