సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలి లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఆమె మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబుతో పాటు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఈ సంవత్సరం జనవరి 8న రమేష్ బాబు మరణించారు. అప్పటి నుంచి ఇందిరా దేవి మానసికంగా కృంగిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉంది.
ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం ఉంచుతారు . మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.