జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్ లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అందిస్తున్న వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న అంశంపై కేంద్రమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భేటీలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు.