చంద్రబాబు మాటల గారడీ చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 4, 373 కోట్ల రూపాయలతో గండికోట జలాశయం నుంచి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంత ప్రజలకు సాగునీరు,తాగునీరు అందించే గాలేరు నగరి – హంద్రీ నీవా అనుసంధాన పనులకు మొలకల చెరువు మండలంలోని నాయుని చెరువు వద్ద శంఖుస్థాపన కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాకు అవసరమైన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో బాబు నిర్లక్ష్యం వహించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అయన కాల్వ గట్లపై పడుకున్నాడు తప్ప నీళ్లు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పం వరకూ నీరు తీసుకురావాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.