Saturday, November 23, 2024
Homeతెలంగాణఅప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు టిడిపి

అప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు టిడిపి

వారంరోజుల క్రితం వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ చేతిలో ఉండేదని, ఇప్పుడు టిడిపి నడిపిస్తోందని  బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు.  హుజూరాబాద్ కాదు ఏ నియోజకవర్గంలో అయినా టిఆర్ఎస్ ను ఓడించడమే బిజెపి లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి, అహంకార పార్టీని దించేవరకు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త నిద్రపోరని తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి అయన మాట్లాడారు.

ఆగస్టు9 కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని వ్యక్తికి బుద్ధి చెప్పడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం సంజయ్ పాదయాత్రతో మొదటి అడుగు పడుతుందని చెప్పారు. ప్రజల బాగుకోసమే బీజేపీ పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మార్పుకు లక్ష్యం పెద్దగా ఉందాని, దాన్ని సాధిస్తామని.  తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెళ్ళే యాత్ర మొదలు పెడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, టీఆర్ఎస్ అనే లంకను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, 3వేల నిరుద్యోగ బృతి ఏమైందని ప్రశ్నించారు. అబద్దపు మాటలు నమ్మి ప్రజలు ఒట్లేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం బిజెపికి ఉందని, తమ పార్టీని ప్రజలే నడిపిస్తారని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతామన్నారు.

మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి టీకాలు, నిధులు ఇచ్చినా వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కేసియార్ ప్రభుత్వం విఫలమైందని తరుణ్ చుగ్ ఆరోపించారు.  దేశంమొత్తం లాక్డౌన్ లో ఉన్నా బిజెపి కార్యకర్తలు ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నారని, జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాలతో సేవా హీ సంఘటన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్