Friday, June 12, 2026
Homeసినిమాఅల్లు పేరు ఆయన వారసులు నిలబెడుతున్నారు: చిరంజీవి

అల్లు పేరు ఆయన వారసులు నిలబెడుతున్నారు: చిరంజీవి

తన మామయ్య అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా ఆయన పేరిట ఓ స్టూడియో ఏర్పాటు  చేయడం ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎంతో మంది నటులు ఉన్నా చాలా కొద్ది మందికి మాత్రలే ఇలాంటి ఘనత దక్కుతుందన్నారు. నార్సింగి సమీపంలోని కోకాపేటలో ఏర్పాటు చేసిన అల్లు స్టూడియోస్ ను చిరంజీవి ప్రారంభించారు. అల్లు రామలింగయ్య గారు ఎంతోముందు చూపుతో కుమారుడు అరవింద్ ను నిర్మాతను చేశారని, గీతా ఆర్ట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిందని గుర్తు చేశారు. వారి మనవళ్ళు  బాబీ, అర్జున్, శిరీష్ కూడా చిత్ర పరిశ్రమలో గొప్పగా రాణిస్తున్నారని, తాము కూడా ఇంతమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోగలిగామని, ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

తరతరాలుగా అల్లు పేరు నిలిచిపోయేలా వారి వారసులు పేరు నిలబెడుతున్నారని కొనియాడారు.  గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ తో ఓ ఇంటర్వ్యూ చిత్రీకరించాల్సి ఉందని, అందుకే తాను ముంబై వెళుతున్నానని చిరంజీవి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular