జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్, పుల్వామాలో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ దగ్గరలోని ద్రాచ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. హతమైన ఉగ్రవాదులు జైష్ ఏ మహమ్మద్ కు చెందినవారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్‌లోనే మూలు అనే ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని పోలీసులు మట్టుబెట్టారు. నాలుగో ఉగ్రవాది లష్కరే తోయిబా కి చెందిన వాడని పోలీసులు వెల్లడించారు.
పుల్వామాలో హతమైన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించినట్టు తెలుస్తోంది.మృతుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సజాద్ అహ్మద్ చక్, రాజా బాసిత్ యాకూబ్‌గా గుర్తించారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం బెంగాల్ వలస కూలీల ప్రాణాలు బలితీసుకున్నారని, ఓ పోలీసు అధికారిని చంపిన ఘటనలో నిందితులని పోలీసులు వివరించారు. యువకులను ఉగ్రవాద గ్రూపులో ప్రేరేపించడంతో పాటు రిక్రూట్ చేయడంలో సజాద్ అహ్మద్ చాక్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు స్పష్టం చేశారు.అనంతరం వారి నుంచి రెండు ఎకె సిరీస్ రైఫిళ్లు, నాలుగు ఎకె మ్యాగజైన్‌లు, 32 రౌండ్‌లతో సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.