Wednesday, December 4, 2024
HomeTrending Newsబీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ - విహెచ్ ఆరోపణ

బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – విహెచ్ ఆరోపణ

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు విమర్శించారు. బీజేపీ తో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చతంపై వి హనుమంత రావు ఈ రోజు హైదరాబాద్ లో స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా అని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, దేశంలో కేసీఆర్ కు ఏ పార్టీ కూడా సహకరించదన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఖర్చు చేస్తాడని ఎద్దేవా చేశారు.

దేశం కేసీఆర్ ను పిలుస్తుంది అని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విహెచ్ అన్నారు.  బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణలో రైతులను పట్టించుకోలేదు .. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో ఇతర రాష్ట్రాల రైతులకు పంచాడని, ప్రజల సొమ్ముతో విమానాలు కొంటున్నాడని విహెచ్ విమర్శించారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని వాడు .. దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారని వ్యంగ్యంగా అన్నారు.  కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే జాతీయ పార్టీ అని తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని వి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : అంబెడ్కర్ విగ్రహం పెట్టె వరకు పోరాటం విహెచ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్