Saturday, July 27, 2024
HomeTrending Newsఅధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

అధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం టిక్కెట్ ధరను పెంచడంపై  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ధర్మాదాయ శాఖ అధర్మంగా ప్రవర్తిస్తోందని అభివర్ణించారు.  కాణిపాకం లో వినాయకుడి అభిషేకం  టికెట్ ధర 750 నుండి 5000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ సోము ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విజయదశమి పర్వదినాన ఇటువంటి విఘాత నిర్ణయాలు తీసుకోవడం వెనుక హిందూ ద్వేషాన్ని వైసీపీ ప్రభుత్వం వెళ్ళగక్కుతోందని ధ్వజమెత్తారు.  అభిషేకం పై పెంచి న ధర ను వెంటనే వాపస్ తీసుకోకపోతే…. న్యాయం చేతిలో అన్యాయానికి పాతర వేస్తామని సోము వీర్రాజు  హెచ్చరించారు.

ద్వారకా తిరుమల కు వచ్చే భక్తులకు కేవలం పులిహోర తో సరిపెడుతున్నారని, చక్రపొంగలి, వడ తదితర పదార్ధాలు ఎందుకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని వీర్రాజు నిలదీశారు.  హిందువుల పర్వదినాల సమయాల్లో దేవాదాయ శాఖ భక్తుల పట్ల కాఠిన్యం ప్రదర్శిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్