Thursday, March 12, 2026
Homeసినిమాపవన్ సరసన నిత్యామీనన్

పవన్ సరసన నిత్యామీనన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్, ‘హరి హర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.

పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ కోసం కొంత మంది తారల పేర్లు పరిశీలించి ఫైనల్ గా నిత్యమీనన్ ను ఖరారు చేశారు. ఈ నెల 12 నుంచి పవన్ కళ్యాణ్‌ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ షెడ్యూల్ 12 నుంచి 18 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, నిత్యమీనన్ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఇక ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే.. ‘పరశురామ రామకృష్ణమూర్తి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. చిత్రయూనిట్ మాత్రం ప్రచారంలో ఉన్న టైటిల్ పై స్పందించలేదు. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular