Thursday, June 11, 2026
Homeస్పోర్ట్స్ICC Mens T20 World Cup 2022: క్వాలిఫైర్ మ్యాచ్ లో విండీస్ ఓటమి

ICC Mens T20 World Cup 2022: క్వాలిఫైర్ మ్యాచ్ లో విండీస్ ఓటమి

టి20 వరల్డ్ కప్ క్వాలిఫైర్  మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో వెస్టిండీస్ 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బౌలింగ్ లో విఫలమైన విండీస్ తర్వాత కూడా రాణించలేక చతికిల పడింది.

హోవార్ట్ లోని బెల్లి రైవ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ తొలి వికెట్ కు (మైఖేల్ జోన్స్-20) 55  పరుగులు చేసింది.  మరో ఓపెనర్ మున్షీ 66 పరుగులతో అజేయంగా నిలవగా, మెక్ లియోడ్-23; బెర్రింగ్టన్-16 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 160 పరుగులు చేసింది.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, హోల్డర్ చెరో రెండు; ఓడియన్ స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో విండీస్ 20 పరుగులకే మొదటి వికెట్ (కేల్ మేయర్స్-20)  కోల్పోయింది. జేసన్ చక్కని భాగస్వామ్యం నమోదు చేయడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. జేసన్ హోల్డర్ (38) ఒక్కడే రాణించాడు. 18.3 ఓవర్లలో 118 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది.

ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు; బ్రాడ్ వీల్, మైఖేల్ లీస్క్ చెరో రెండు; జోష్ డావీ, సఫియాన్ చెరో వికెట్ పడగొట్టారు.

జార్జ్ మున్షీ కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : క్వాలిఫైర్ మ్యాచ్ లో లంకకు నమీబియా షాక్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular