తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కె.నారాయణ రెండవ సారి కార్యదర్శివర్గానికి ఎన్నికవ్వగా, తెలంగాణకు చెందిన సయ్యద్ అజీజ్ పాషా మొదటిసారిగా కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన సిపిఐ 24వ జాతీయ మహాసభలో చివరి రోజు మంగళవారం నాడు నూతన జాతీయ సమితిని ప్రతినిధులు ఎన్నుకున్నారు. అనంతరం నూతన జాతీయ సమితి డి.రాజాను ఏకగ్రీవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. 2018 ఏప్రిల్లో కేరళ రాష్ట్రం కొల్లాంలో జరిగిన సిపిఐ 23వ జాతీయ మహాసభలో సురవరం సుధాకర్రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవగా, ఆయన 2019 జూలైనెలలో అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో డి.రాజాను ఢల్లీిలో జరిగిన జాతీయ సమితి మొదటిసారిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది. ఇప్పుడు రెండసారి 24వ జాతీయ మహాసభలో ఆయన ఎన్నికయ్యారు. మహాసభ 125 మంది జాతీయ సమితి సభ్యులను , 31 మంది (ఒకస్థానం ఖాళీ) కార్యవర్గ సభ్యులను , 11 మంది కార్యదర్శులను ఎన్నుకుంది. అలాగే కార్యదర్శివర్గంలోకి అనీ రాజా, గిరీశ్ శర్మలను ఆహ్వానితులుగా తీసుకున్నారు.
కార్యదర్శివర్గంలో ముగ్గురు కొత్తవారు: జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా డి.రాజా, కానం రాజేంద్రన్, అతుల్ కుమార్ అంజాన్, అమర్జీత్ కౌర్, డాక్టర్ కె.నారాయణ, డాక్టర్ బి.కె.కాంగో, బినోయ్ విశ్వం, పల్లభ్ సేన్ గుప్తా, నాగేంద్రనాథ్ ఓరaా, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండాలు ఎన్నికయ్యారు. వీరిలో సయ్యద్ అజీజ్ పాషా, నాగేంద్రనాథ్ ఓరaా, రామకృష్ణ పాండాలు తొలిసారిగా కార్యదర్శి వర్గానికి ఎన్నికయ్యారు. సయ్యద్ అజీజ్ పాషా విద్యార్థి ఫెడరేషన్ నుండి జాతీయ స్థాయిలో ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం సిపిఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యులుగా, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఆయన 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
జాతీయ కార్యవర్గంలో చాడ, కూనంనేని: తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి కార్యవర్గానికి కె.రామకృష్ణ, అక్కినేని వనజ ఎన్నికయ్యారు.
తెలంగాణ నుండి జాతీయ సమితి సభ్యులు వీరే : రాష్ట్రం నుండి సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, బాలనర్సింహా, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహా(క్యాండిడేట్్ మెంబర్), ఎన్.బాలమల్లేశ్ (ఆహ్వానితులు)గా ఎన్నికయ్యారు.
కంట్రోల్ కమిషన్లో యూసుఫ్: జాతీయ కంట్రోల్ కమిటీలో తెలంగాణ నుండి ఎఐటియుసి నాయకులు మహ్మద్ యూసుఫ్ సభ్యులుగా మహాసభ ఎన్నుకుంది.