Thursday, June 11, 2026
Homeసినిమాఅంచ‌నాలు పెంచేసిన ర‌వితేజ‌ 'ధ‌మాకా' టీజ‌ర్

అంచ‌నాలు పెంచేసిన ర‌వితేజ‌ ‘ధ‌మాకా’ టీజ‌ర్

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందుతోన్న‌ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా‘. ‘శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్  సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీలో విడుదల చేసిన మేకర్స్ దీపావళిని ముందుగానే ప్రారభించారు. ఇక‌ టీజర్ లోకి వెళితే.. ధమాకా రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. అతని  డాషింగ్ క్యారెక్టర్‌ ని ప్రజంట్ చేసింది డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు. టీజర్ లో రవితేజ పలికిన కొన్ని వన్ లైనర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు.. కానీ నేను యాక్షన్ లో ఉన్నప్పుడు శాడిస్ట్’ ని అంటూ ఇంగ్లీష్ లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘అట్నుంచీ ఒక బుల్లెట్ వస్తే… ఇట్నుంచి దీపావళి’ అనే డైలాగ్ కూడా రవితేజ మార్క్ లో పవర్ ఫుల్ గా పేలింది.  డిసెంబ‌ర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మ‌రి.. ర‌వితేజ ఆశించిన విజ‌యం సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular