Thursday, April 25, 2024
Homeసినిమా'ఓరి దేవుడా' .. విడాకులు తీసుకోవాలనుకున్నాక మొదలైన ప్రేమకథ!

‘ఓరి దేవుడా’ .. విడాకులు తీసుకోవాలనుకున్నాక మొదలైన ప్రేమకథ!

Mini Review: ఈ మధ్య కాలంలో వచ్చిన విభిన్నమైన కాన్సెప్టులలో ‘ఓరి దేవుడా ..!’ ఒకటిగా చెప్పుకోవాలి. విష్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా మిథిల – ఆషా భట్ కనిపిస్తారు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా అశ్వథ్ మారిముత్తు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ఒక వైపున ప్రేమకి .. పెళ్లికి మధ్య జరిగే ఘర్షణ, మరో వైపున దేవుడికి .. మనిషికి మధ్య జరిగే షరతులతో కూడిన సంభాషణ .. ఇదీ కథ.  మొత్తానికి ఒక కొత్త పాయింటును పట్టుకునే దర్శకుడు రంగంలోకి దిగాడు.

అర్జున్ (విష్వక్ సేన్)  తన గర్ల్ ఫ్రెండ్ అనూ ( మిథిల)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఒక ఫ్రెండ్ గానే తప్ప .. ఆమెను భార్యగా చూడలేకపోతుంటాడు. తనకి ఇష్టమైన యాక్టింగ్ వైపు వెళ్లలేక, మామగారి ఆఫీసులో పనిచేయలేక ఇబ్బంది పడుతుంటాడు. అదే సమయంలో సినిమా ఫీల్డ్ తో పరిచయమున్న తన స్కూల్ డేస్ నాటి ఫ్రెండ్ మీరా (ఆషా భట్) అతనికి తారసపడుతుంది. వాళ్ల  పరిచయం అనూకి అనుమానం కలిగిస్తుంది. అది అనేక గొడవలకు కారణమై విడాకుల వరకూ వెళుతుంది. కొత్త లైఫ్ ను అర్జున్ కోరుకుంటున్న సమయంలోనే అతనికి దేవుడిని కలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తీసుకుంటుంది.

విష్వక్ సేన్ తన ఇమేజ్ కి భిన్నమైన కథను ఎంచుకోవడం విశేషం. సున్నితమైన ఫీలింగ్స్ తోను ఆకట్టుకున్నాడు. ఇద్దరు హీరోయిన్స్  కూడా గ్లామర్ కి చాలా దూరంలో కనిపిస్తారు. కాకపోతే వెబ్ సిరీస్ లతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మిథిల యాక్టింగ్ పరంగా అదరగొట్టేసింది. లియోన్ పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. ఫొటోగ్రఫీ కూడా బాగుంది. పాయింట్ కొత్తదే అయినా దర్శకుడు అసలు కథను ట్రాక్ ఎక్కించడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఫస్టాఫ్ లో కొని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అందువలన ఫస్టాఫ్ కాస్త అసహనాన్ని  కలిగిస్తుంది. సెకండాఫ్ లో పాత్రలు కొత్త కోణంలో నడవడం వలన బాగానే అనిపిస్తుంది. ముగింపు కూడా కరెక్టుగానే కనిపిస్తుంది. మరి ఈ కొత్త దర్శకుడి కొత్త ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

Also Read : ‘జిన్నా’ అటువైపు వెళ్లకుండా ఉండాల్సిందేమో! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్