ఇరవై ఏళ్లలో కెసిఆర్ తో పెట్టుకొని బతికిబట్ట కట్టింది తాను ఒక్కన్నే అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు నుండి ఈ పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని, మా దగ్గర 30 ఏళ్ల క్రితం ఇలాంటి రోడ్లు చూశామన్నారు. కెసిఆర్ బంగారు తెలంగాణ ఎందో మునుగోడుకి వస్తే తెలుస్తుందని ఈటల రాజేందర్ చెప్పారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లిలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్…కెసిఆర్ మెడలు వంచి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. పెన్షన్ ఆపడానికి వారి అబ్బ జాగీరు కాదన్నారు.
కరోనా సమయంలో కూడా బయటికి వచ్చి ఒదార్చని కెసిఆర్… మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గొంతు నొక్కడానికి స్వయంగా వస్తున్నారట. లెంకలపల్లిలో కుర్చీ వేసుకొని కూర్చొని ఓడిస్తారట అని ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడు ప్రజలకోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అయన రాజీనామా వల్లనే ముఖ్యమంత్రి, 16 మంది మంత్రులు, 81 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారు. రాజగోపాల్ రెడ్డి జీవితం ధన్యం అయ్యిందన్నారు. గట్టుప్పల్ మండలం వచ్చింది. 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా కూడా డబుల్ బెడ్ రూం కట్టలేని సన్యాసి కెసిఆర్ అన్నారు. అబద్దాల కొరు, మాటలతో వంచించి.. ప్రజలను మోసం చేసే వ్యక్తి కెసిఆర్ అని ఆరోపించారు. మోసం చేసే వారికి బుద్ది చెప్పే ఎన్నిక మునుగోడు ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే, అయన గెలిస్తే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి ఏమీ రాకపోవచ్చు కానీ కెసిఆర్ అహంకారం అణుగుతుందన్నారు. మునుగోడులో గెలిచేది వ్యక్తి కాదు 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవం అన్నారు.
కెసిఆర్ కి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి? విమానాలు ఎలా కొంటున్నారు? ఓట్లు కూడా కొనడానికి వస్తున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం రాజగోపాల్ రెడ్డికి వేయండని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలు చెప్పి ఓట్లు వేసుకొని పోవడానికి రాలేదు. మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : పైరవీల నిలయం ప్రగతిభవన్- ఈటల రాజేందర్