Wednesday, March 18, 2026
HomeTrending Newsఅమరావతే నిలుస్తుంది... గెలుస్తుంది: బాబు ట్వీట్

అమరావతే నిలుస్తుంది… గెలుస్తుంది: బాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంఖుస్థాపన చేసి నేటికి ఏడు సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాడు పాల్గొన్న కార్యక్రమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో  షేర్ చేస్తూ  అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది. అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడు.  అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది…. అమరావతే గెలుస్తుంది… ఇదే ఫైనల్” అంటూ పోస్ట్ చేశారు.

Also Read :  అమరావతికి అందరూ ఒప్పుకున్నారు: బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular