Sunday, May 19, 2024
HomeTrending Newsఅమరావతి పాదయాత్రకు విరామం

అమరావతి పాదయాత్రకు విరామం

అమరావతి రైతులు తమ మహా పాదయాత్రకు నాలుగురోజుల పాటు విరామం ప్రకటించారు. యాత్ర నిర్వహణపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిన్న కొన్ని సూచనలు చేసింది.  600 మందికి మించి పాదయాత్రలో పాల్గొనరాదని, యాత్రలో పాల్గొంటున్న వారు గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించింది. యాత్ర సమయంలో ప్రత్యర్థులు, పోటీ ఆందోళనలకు అనుమతి ఇవ్వకూడదని  పోలీసులకు సూచించింది. యాత్రకు మద్దతు తెలపాలనుకునేవారు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని తమ సంఘీభావం తెలపాలని, యాత్రికులతో కలిసి నడవొద్దని నిర్దేశించింది.

అయితే హైకోర్టు తీర్పు పేరుతో పోలీసులు తమ యాత్రపై అనేక అంక్షలు విధిస్తూ వేధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తాము బస చేస్తున్న ప్రాంతం నుంచి ఐడి కార్డులు ఉన్నవారినే బైటకు అనుమతిస్తున్నారని, లేని వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని,  వరుసగా మూడు రోజులపాటు హైకోర్టుకు సెలవలు ఉండడంతో నాలుగు రోజులపాటు యాత్రకు విరామం ఇచ్చి కోర్టు తీర్పు తర్వాతే యాత్ర పునరుద్ధరించాలని వారు భావిస్తున్నారు.  అప్పటివరకూ  పాదయాత్ర నిలిపివేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు.

Also Read : అమరావతి ‘మహా పాదయాత్ర’ ప్రారంభం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్